ఛత్తీస్గఢ్ కోర్బా జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. తనపై కేసు పెట్టిందన్న కోపంతో జైలు నుంచి వచ్చి ఆ మహిళ ముఖంపై కొడవలితో దాడి చేసి ప్రాణాలు తీశాడు ఇంద్రపాల్ తొండే అనే కిరాతకుడు.
బాధితురాలు భర్తకు దూరంగా ఒంటరిగా నివాసముంటోంది. అదే కాలనీకి చెందిన ఇంద్రాపాల్ తొండే ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. అభ్యంతరకర వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. ఆ మహిళ కేసు పెట్టగా... ఇంద్రపాల్ కటకటాల పాలయ్యాడు. జైలుకు వెళ్లి వచ్చిన ఇంద్రపాల్.. ఆమెపై కోపంతో ఊగిపోయాడు. కొడవలితో 20 సార్లకుపైగా ఆమె ముఖంపై దాడి చేశాడు.
తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని 112కి ఫోన్ చేసి ఆసుపత్రిలో చేర్చారు స్థానికులు. ఆమె ముఖానికి దాదాపు 200 కుట్లు పడ్డాయి. అయినా ఫలితం దక్కలేదు. తీవ్ర రక్తస్రావం కారణంగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఐపీసీ సెక్షన్ 307 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.
ఇదీ చదవండి:'ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు'