లాడెన్లోని ఉగ్రకోణం
ఈ ఉగ్రవాద ఏనుగు మానుషులపై జాలి చూపకుండా అతి క్రూరంగా తొక్కి చంపేది. మార్చిలో అసోంలోని రంగాగఢ్ ప్రాంతంలో ఇంట్లో నిద్రిస్తున్న ఓ వ్యక్తిని బయటకు ఈడ్చుకొచ్చి, శరీర భాగాలను నుజ్జ నుజ్జు చేసి మరీ చంపింది. 2018 నుంచి ఇప్పటివరకు గోల్పరా ప్రాంతంలో దాదాపు 46 మంది ఈ మదగజానికి బలయ్యారు.
ఈ ఏనుగు ఏ సమయంలో ఎలా దాడి చేస్తుందో తెలియక సమీప గ్రామస్థులు చాలా కాలం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు.
బందీ అయిన ఆరు రోజులకే
లాడెన్ ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు దానిని బంధించాలనీ అటవీ శాఖ అధికారులు కొన్ని నెలలు ప్రయత్నించారు. ఎట్టకేలకు ఈ నెల 12న ఏనుగును పట్టుకున్నారు. లాడెన్‌కు కొత్తగా 'కృష్ట' అని నామకరణం చేశారు.
బంధించిన గజాన్ని ఆరెంజ్ జాతీయ పార్క్‌కు తీసుకువచ్చారు. శనివారం రాత్రి వరకు ఆరోగ్యంగానే ఉన్న లాడెన్ ఏమైందో ఏమో గానీ... ఆదివారం ఉదయం చూసేసరికి శవమై కనిపించింది. లాడెన్ అలియాస్ కృష్ణ మృతికి గుండెపోటు రావడమే కారణమని పోస్ట్ మార్టమ్‌లో తేలింది.
ఇదీ చదవండి:గొర్రెలు కాస్తున్న పిల్లలపై లారీ బోల్తా- ఆరుగురు మృతి