భారీ ఉగ్రకుట్రను దిల్లీ ప్రత్యేక పోలీసు విభాగం భగ్నం చేసింది. అసోంలోని గోల్పాడా జిల్లాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది. వీరి వద్ద కిలో పేలుడు పదార్థాలతో పాటు ఒక తల్వార్, కత్తి స్వాధీనం చేసుకున్నామన్నారు డీసీపీ ప్రమోద్ కుశ్వాహా.
"అసోంలోని గోల్పాడా జిల్లాలో ఐఎస్ఐఎస్ ప్రభావిత ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేశాం. అక్కడ జరిగే కృష్ణుడి ఊరేగింపు సమయంలో ఓ రెస్టారెంట్లో బాంబు పేల్చాలని ప్రణాళికలు చేశారు. ఇది విజయవంతమైతే దిల్లీలో అదే తరహా పేలుళ్లకు పాల్పడాలనుకున్నారు. ఈ విషయం గురించి మాకు సమాచారం అందింది. ఇందుకోసం దిల్లీలో మరికొంత మందికి శిక్షణ ఇచ్చారు. వాళ్ల దగ్గర వాడటానికి సిద్ధంగా ఉన్న ఒక ఐఈడీ బాంబు ఉంది."
-ప్రమోద్ కుశ్వాహా, డీసీపీ
అరెస్టయిన వారు ముకదీర్ ఇస్లాం, రంజిత్ అలీ, జమీల్ లూయిత్గా గుర్తించారు. వీరందరూ 20 ఏళ్లలోపు వారేనని తెలిపారు.
ఇదీ చూడండి: నౌకాదళంలో తొలి మహిళా పైలట్ శివాంగి