ప్రతిరోజూ పాఠశాలకు వచ్చే బాలికల కాళ్లను గంగా జలంతో కడిగే రాజ భయ్య... తర్వాత వారికి మిఠాయిలు అందిస్తారు. దుర్గాదేవి తొమ్మిది రూపాలకు నిదర్శనంగా తొమ్మిది మంది బాలికలను పూజిస్తారు. ఆ చిన్నారులకు రుచికరమైన వంటకాలు.., బహుమతులు కూడా అందిస్తారు. స్త్రీ నుంచే సృష్టి పుట్టిందని.., ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ స్త్రీని గౌరవించాలని రాజా భయ్యా సోని సూచిస్తారు.
నవరాత్రుల్లో కన్యాపూజ నిర్వహిస్తారు.
"నేను ప్రతిరోజూ పాఠశాలలో కన్యాపూజ నిర్వహిస్తాను. సమాజంలోని ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలనే ఉద్దేశంతో ఈ పూజ నిర్వహిస్తున్నాను. మహిళలు పూజనీయులు. మహిళలందరినీ గౌరవించాలి." - రాజా భయ్యా సోని, ఉపాధ్యాయుడు
చిన్నారులకు రాజా సోని చేసే పూజను స్థానికులు ఎంతో గౌరవిస్తారు. ఇప్పటివరకు ఆయన.. 7 వేల మందికిపైగా బాలికలకు కన్యాపూజ చేశారు. మహిళా శక్తిని చాటి చెప్పేందుకు సోని చేసిన కృషిని... ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. సోని సేవలపై గ్రామస్తుల నుంచి సమాచారం సేకరించిన తర్వాత రికార్డ్స్‌లో నమోదు చేశారు.