ETV Bharat / bharat

మహా చదరంగం: మోదీ-షా X శరద్​ పవార్​ - మహారాష్ట్ర రాజకీయాలు

ఊహించని మలుపులు.. అనూహ్య పరిణామాలతో మహారాష్ట్ర రాజకీయాలు చదరంగాన్ని తలపిస్తున్నాయి. అధికారం కోసం రాజకీయ పార్టీలు వేస్తున్న ఎత్తులు పైఎత్తులతో....మరాఠా రాజకీయం దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. మోదీ-షా ద్వయం ఒకవైపు నిలిస్తే... మరాఠా కురువృద్ధుడు శరద్‌ పవార్ మరోవైపు పోరాడుతున్నారు. ఈ రాజకీయ చదరంగంలో గెలుపు ఎవరిదోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.

మోదీ-షా X శరద్​ పవార్​
author img

By

Published : Nov 23, 2019, 9:16 PM IST

గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చదరంగాన్ని తలపిస్తున్నాయి. అధికార పగ్గాలు చేపట్టేందుకు రాజకీయ పార్టీలు వేస్తున్న ఎత్తులు పై ఎత్తులతో మరాఠా రాజకీయం రంజుగా సాగుతోంది. మరాఠా రాజకీయ చదరంగంలో ఓ వైపు మోదీ- షా ద్వయం.. మరోవైపు ఎన్సీపీ అధినతే శరద్ పవార్ మోహరించారు.

సార్వత్రిక సమరం నుంచే...

సార్వత్రిక ఎన్నికల సమయం నుంచే ఎన్సీపీతో పాటు శరద్‌ పవార్‌ను మోదీ- షా ద్వయం లక్ష్యంగా చేసుకుంది. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో మోదీ-షా.. కాంగ్రెస్‌ను కాకుండా శరద్‌పవార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించడం అప్పట్లో రాజకీయ విశ్లేషకులనూ ఆశ్చర్యపరిచింది.

మరింత దూకుడుగా..

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల నాటికి మరింత దూకుడు పెంచిన భాజపా ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు టికెట్లు ఆఫర్ చేసింది. మాజీ మంత్రులు, సీనియర్ నేతలు గణేష్ నాయక్, సచిన్ ఆహిర్, భాస్కర్ జాదవ్ తదితరులను కమలదళం తమ గూటికి చేర్చుకుంది.

ఫడణవీస్​ విమర్శలు..

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలోనూ భాజపా నేతలు.. శరద్ పవార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శరద్‌ పవార్‌ను హిందీ సినిమా షోలేలో జైలర్‌గా పోల్చిన దేవేంద్ర ఫడణవీస్... అతనిలా పవార్ వెంట ఎవరూ నిలవరని ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం... శరద్ పవార్ రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతామంటూ పెద్దయెత్తున విమర్శలు చేశారు.

అమిత్​ షా వర్సెస్ పవార్​

అమిత్‌షా... మహారాష్ట్రకు పవార్ ఏం చేశారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఐతే షా విమర్శలను బలంగా తిప్పికొట్టారు శరద్ పవార్. ఏం చేసినా ఏం చేయకపోయినా జైలుకు మాత్రం వెళ్లలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.

అనంతరం మహారాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణం కేసులో పవార్‌పై ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరాన్ని ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో పవార్‌కూ ఇదే పరిస్థితిని ఎదుర్కొనాల్సి ఉంటుందంటూ షా విమర్శించారు.

షా విమర్శలకు తనదైన రీతిలో బదులిచ్చారు శరద్ పవార్. ఏ సమయంలోనైనా ఈడీ విచారణకు సిద్ధమని ప్రకటించారు. బ్యాంకులో సభ్యుడిగా కానీ, డైరెక్టర్‌గా కానీ లేని తనపై ఆరోపణలు రావడమేంటని ప్రశ్నించారు శరద్ పవార్. ఈడీ విచారణకు స్వయంగా హాజరయ్యేందుకు సిద్ధపడ్డారు. ఈ ఘటనతో మరాఠా ప్రజల్లో పవార్ పట్ల సానుభూతి వ్యక్తమైంది.

మారిన రాజకీయ వాతావరణం..

అనంతరం జరిగిన పరిణామాలతో శాసనసభ ఎన్నికల్లో భాజపా విజయం నల్లేరుపై నడకేనన్న అభిప్రాయం మారుతూ వచ్చింది. ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యవహరించిన శరద్‌పవార్.. భాజపాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు కానీయమంటూ ముగింపు దశలో పవార్ చేసిన ఎన్నికల ప్రచారం... అప్పటి వరకూ మహారాష్ట్రలో నెలకొన్న ఎన్నికల వాతావరణాన్ని పూర్తిగా మార్చివేసింది.

శివసేనతో ఎన్సీపీకి అవకాశం..

ఎన్నికల ఫలితాల అనంతరం భాజపా- శివసేన మధ్య విభేధాలు పొడసూపడం శరద్‌పవార్‌కు కలిసొచ్చింది. కాంగ్రెస్‌, శివసేనలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి భాజపాతో లెక్కసరిచేసే అవకాశం లభించింది.

భాజపా వ్యూహాత్మక మౌనం

మహారాష్ట్రలో ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా సహా భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఇన్ని రోజులు పెదవి విప్పలేదు. ఇన్నాళ్లూ వ్యూహాత్మక మౌనం వహించిన మోదీ- షా ద్వయం.. లోలోపలే తమ మంత్రాంగాన్ని నడిపారు. పవార్‌తో లెక్క సరిచేసేందుకు సిద్ధమయ్యారు. శనివారం ఉదయానికి అనుకున్నది కానిచ్చేశారు.

ఇప్పుడే పూర్తికాలేదు..!

అయితే తాజా పరిణామంతో మోదీ-షా ద్వయం మరాఠా కురువృద్ధుడికి పూర్తిగా చెక్‌పెట్టినట్టేనని భావించలేం. ఎందుకంటే శనివారం మధ్యాహ్నం జరిగిన విలేకర్ల సమావేశంలో 30వ తేదీ జరిగే విశ్వాస పరీక్షలో దేవేంద్ర ఫడణవీస్ సర్కారు మెజారిటీని నిరూపించుకోలేదని శరద్ పవార్ బలంగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఫడణవీస్ సర్కారు మెజారిటీని నిరూపించుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

వీటన్నింటిని గమనిస్తే ఒకటిమాత్రం నిజం.. 30వ తేదీ ఏం జరిగినా మోదీ- షా ద్వయం, శరద్ పవార్‌ల ఆట ఇక్కడితో ముగియదు.

ఇదీ చూడండి: ఎన్​సీపీ ఎప్పుడూ భాజపాతో చేతులు కలపదు: పవార్

AP Video Delivery Log - 1200 GMT ENTERTAINMENT
Saturday, 23 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0559: US Banker Misconduct Allegations AP Clients Only 4241364
Apple delays theatrical release of 'The Banker' amid misconduct allegations against one of the film's co-producers
AP-APTN-0507: US Cohen ADL Speech AP Clients Only 4241353
Sacha Baron Cohen takes on Mark Zuckerberg in speech blaming social media for many of the world's ills
AP-APTN-2328: US Most Musical Family Content has significant restrictions, see script for details 4241350
Ciara, Nick Lachey, David Dobrik and Debbie Gibson search for 'America's Most Musical Family'
AP-APTN-2214: US Dave East Content has significant restrictions, see script for details 4241341
Rapper Dave East talks finally releasing his debut album 'Survival' and why Hollywood is calling
AP-APTN-2213: US Scooter Braun Content has significant restrictions, see script for details 4241346
Scooter Braun breaks his silence on his Taylor Swift battle
AP-APTN-2113: US FL Dog Driving Circles AP Clients Only 4241338
Dog left alone in a car drives in circles
AP-APTN-2011: South Africa Giraffe AP Clients Only 4241302
Abandoned giraffe watched over by dog in SAfrica
AP-APTN-1838: ARCHIVE Freida Pinto AP Clients Only 4241333
'Slumdog Millionaire' actress Freida Pinto is engaged
AP-APTN-1757: US Holiday Windows AP Clients Only 4241328
Macy's in NYC unveils its annual holiday windows
AP-APTN-1546: World Minecraft AP Clients Only 4241307
'Minecraft' launches as a new augmented reality mobile game
AP-APTN-1539: US CE Tour Gifts Content has significant restrictions, see script for details 4241304
Cars, tractors, boats: Country stars talk about extravagant end of tour gifts
AP-APTN-1522: UK Prince Andrew Windsor AP Clients Only 4241301
Prince Andrew leaving Royal Lodge in Windsor
AP-APTN-1520: US CE Country Watches AP Clients Only 4241298
Country singers show off their watches at the CMA Awards, BMI Country Awards
AP-APTN-1349: US Trump Medals AP Clients Only 4241287
Trump awards medals to Jon Voight, Alison Krauss
AP-APTN-1313: Germany Pandas Must credit Zoo Berlin; Editorial use only 4241278
Zoo Berlin's twin panda cubs thriving and relaxed
AP-APTN-1210: US Prince Andrew AP Clients Only 4241265
Allred urges prince to meet US authorities
AP-APTN-1207: New Zealand UK Royals 2 No access new Zealand 4241263
Prince Charles ignores question about his brother
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.