ETV Bharat / bharat

ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై.. చిన్నారులు సహా ఏడుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ కార్పెట్​ పరిశ్రమలో గ్యాస్​ లీకై ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పొట్టకూటికి వచ్చిన కూలీల కుటుంబాలు విధి నాటకానికి బలయ్యాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉండటం స్థానికుల హృదయాలను కలచివేస్తోంది. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షలు పరిహారం ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్​.

7 killed after gas leak at Sitapur factory in Uttar Pradesh
ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై.. చిన్నారులు సహా ఏడుగురు మృతి
author img

By

Published : Feb 6, 2020, 1:30 PM IST

Updated : Feb 29, 2020, 9:44 AM IST

ఫ్యాక్టరీలో గ్యాస్ లీకు

ఉత్తర్​ప్రదేశ్​ బిస్వా​లో దారుణం జరిగింది. ప్రముఖ కార్పెట్​ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ కారణంగా.. ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది.

ఈ రోజు ఉదయం జలాల్​పుర్​లోని దరీ ఫ్యాక్టరీకి చేరుకున్న కార్మికులు.. గ్యాస్​ లీకైనట్లు గమనించారు. పరిశ్రమ పరిసర ప్రాంతంలో ఏడు మృతదేహాలను చూసి కంగుతిన్నారు. కుటుంబంతో సహా ఫ్యాక్టరీ సమీపాన గుడారాల్లో నివసిస్తున్న కూలీలు.. విష వాయువు పీల్చడం వల్ల నిర్జీవులయ్యారు.

ట్యాంకర్​ వల్లేనా?

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ కార్పెట్ కర్మాగారానికి పక్కనే యాసిడ్ ఫ్యాక్టరీకి చెందిన ట్యాంకర్ కడుగుతారు. బహుశా, దాని నుంచి గ్యాస్ లీక్ అయి ఉంటుందని అనుమానిస్తున్నారు.

మృతుల్లో ఓ మహిళ సహా ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలిపారు పోలీసులు. ఆ పరిసరాల్లో సంచరిస్తున్న నాలుగు అడవి కుక్కలూ గ్యాస్​ లీకేజీకి బలైనట్లు వెల్లడించారు అధికారులు.

ప్రభుత్వ స్పందన

ఈ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ప్రకటించారు​.

ఇదీ చదవండి:సొంత బిడ్డను సంచిలో దాచి.. ఆపై!

Intro:Body:

visuals of Sitapur gas leak incident in which 7 were dead has been shared in hindi in 

Conclusion:
Last Updated : Feb 29, 2020, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.