ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం జరిగింది. 11 మందితో ప్రయాణిస్తున్న ఓ కారు ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
ఆదివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. దిల్లీ వైపు వెళుతున్న క్రమంలో దంకౌర్ ప్రాంతంలో కారు అదుపు తప్పి ఖేర్లి కాలువలోకి దూసుకెళ్లిందని.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.
మృతులు సంభల్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు.
పొగమంచే కారణం..
దట్టమైన పొగమంచు కమ్ముకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు