గడిచిన తొమ్మిదేళ్లలో.... నక్సల్స్ హింసలో 3 వేల 700 మందికి పైగా మరణించారని కేంద్రహోంశాఖ తన వార్షిక నివేదికలో పేర్కొంది. 2010 నుంచి 2018 వరకు మావోయిస్టు ప్రభావితమైన పది రాష్ట్రాల్లో జరిగిన నక్సల్స్ హింసను తన నివేదికలో ప్రస్తావించింది.
నివేదిక ప్రకారం మావోయిస్టుల ప్రాబల్యం ఛత్తీస్‌గఢ్‌లో అధికంగా ఉందన్న హోం శాఖ ఆ తర్వాత ఝార్ఖండ్, బిహార్‌లు ఉన్నట్లు తెలిపింది. దేశంలో వామపక్ష తీవ్రవాదం అత్యంత శక్తిమంతంగా కొనసాగుతోందన్న హోంశాఖ హింసాత్మక ఘటనల్లో మావోయిస్టుల పాత్రే అధికంగా ఉందని వివరించింది. అయితే గత దశాబ్దంతో పోలిస్తే నక్సల్స్ హింసాత్మక ఘటనలు 26 శాతం మేర తగ్గాయని తెలిపింది.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల వల్ల హింస తగ్గిందన్న కేంద్ర హోంశాఖ, జనజీవన స్రవంతిలో కలిసేందుకు నక్సల్స్ ముందుకొస్తున్నట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి:జమ్ముకశ్మీర్‌లో గ్రనేడ్ దాడి.. ఆరుగురికి గాయాలు