ETV Bharat / bharat

సౌదీ అరేబియాతో భారత్​ 12 ఒప్పందాలు - 12 pacts between india and saudi

భారత్- సౌదీ అరేబియా మధ్య పరస్పర సహకారం కోసం వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పాటుకు ఇరు దేశాలమధ్య ఒప్పందం కుదిరింది. మండలి ఏర్పాటుతో పాటు మరో 12 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. సౌదీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా పెట్టబడుల సదస్సులో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత్‌లో మౌలికవసతుల రంగంలో భారీపెట్టుబడులకు అవకాశాలు ఉన్నట్లు వివరించారు.

సౌదీ అరేబియాతో భారత్​ 12 ఒప్పందాలు..
author img

By

Published : Oct 30, 2019, 5:13 AM IST

Updated : Oct 30, 2019, 7:54 AM IST

సౌదీ అరేబియాతో భారత్​ 12 ఒప్పందాలు

రెండురోజుల సౌదీఅరేబియా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ..ఆ దేశ రాజు సల్మాన్ బిన్‌ అబ్దులజీజ్‌తో పాటు యువరాజు మహ్మద్​ బిన్ సల్మాన్‌తోనూ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వివిధ ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు.

ఈ పర్యటనలో దాదాపు 12 అంశాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాల పరస్పర అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమైన అంశాలపై చర్చించి త్వరితగతిన నిర్ణయం తీసుకునేందుకు వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని ఏర్పాటుచేశారు. ఈ మండలికి మోదీ, యువరాజు సల్మాన్‌ అధ్యక్షులుగా ఉంటారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి సమావేశమై చర్చలు జరుపుతారు.

ఉగ్రవాదంపై పోరు

ఉగ్రవాద కార్యకలాపాలను తీవ్రంగా ఖండించారు మోదీ, సల్మాన్‌. ఉగ్రభూతం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని ప్రకటించారు. జాతి, మతం, సంస్కృతితో సంబంధం లేకుండా తీవ్రవాదంపై పోరుకు సహకరిస్తామని..పాకిస్థాన్‌కు సహజ భాగస్వామి అయిన సౌదీఅరేబియా భారత్‌కు హామీ ఇచ్చింది.

ఇంధన సహకారం

ఇరుదేశాల మధ్య ఇంధన సహాకారంపైనా సౌదీ ఇంధనశాఖ మంత్రి యువరాజు అబ్దుల్అజీజ్ బిన్ సల్మాన్​తో చర్చలు జరిపారు మోదీ . మహారాష్ట్రలోని రాయ్​గఢ్​లో నిర్మిస్తున్న వెస్ట్ కోస్ట్ రిఫైనరీ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఇరాక్ తర్వాత భారత చమురు అవసరాలను తీర్చుతున్న రెండో దేశం సౌదీనే కాగా.... ఏటా 40.33 మిలియన్ టన్నుల ముడిచమురును సౌదీ అరేబియా నుంచి దిగమతి చేసుకుంటోంది భారత్​. నెలకు 2లక్షల టన్నుల ఎల్​పీజీని కొనుగోలు చేస్తోంది. ఇటీవల సౌదీకి చెందిన చమురు బావులపై దాడులు జరుగుతున్నప్పటికీ భారత్‌కు ఇంధన సరఫరాలో ఏ విధమైన సమస్యలు రాబోవని సౌదీ పేర్కొంది.

సౌదీలో రూపే కార్డు సేవలు

రూపేకార్డును సౌదీఅరేబియాలో ఉపయోగించే విధంగా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇది అక్కడున్న 26 లక్షల మంది భారతీయులతో పాటు.. సౌదీకి ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లేవారికి ఉపకరిస్తుందని మోదీ చెప్పారు.

ద్వైపాక్షిక చర్చలకు ముందు ప్రధాని మోదీ... సౌదీ పెట్టుబడుల సదస్సులో ప్రసంగించారు. భారత్ దాదాపు 100 బిలియన్ డాలర్లమేర మౌలిక వసతుల కల్పనలో పెడుతుందని మోదీ చెప్పారు. భారత్‌లో ఈ రంగంలో స్థిరమైన అభివృద్ధి ఉంటుందని పెట్టుబడుదారులు ధైర్యంగా ముందడుగు వేయొచ్చని తెలిపారు.

ఐరాసను సంస్కరించాలి

బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ వ్యవస్థాపకుడు రే డాలియోతో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు మోదీ. ఐక్యరాజ్యసమితిని అత్యవసరంగా సంస్కరించాల్సి ఉందన్నారు. కొన్నిదేశాలు ఈ సంస్థను ఓ సంస్థగా కాకుండా తమ పనులు నెరవేర్చుకునేందుకు ఓ సాధనంగా వినియోగిస్తున్నాయని విమర్శించారు. 21వ శతాబ్దపు వాస్తవాలకు అనుగుణంగా ఐరాసలో సంస్కరణలు అత్యావశ్యకమన్నారు.

ఈ పర్యటనలో జోర్డాన్‌ రాజుతోనూ మోదీ భేటీ అయి వివిధ అంశాలపై చర్చలు జరిపారు. పర్యటన పరిపూర్ణం అయినట్లు ట్విట్టర్​లో తెలిపారు మోదీ.

ఇదీ చూడండి: కశ్మీర్​లో దాడులకు పాక్​ ఉగ్రమూకలు కుట్ర

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Available worldwide. Regular scheduled news bulletins only. Max use 3 minutes. Use within 48 hours. Can by part of a VOD service of the entire bulletin. No archive.
DIGITAL: Stand alone clips allowed but NOT on social platforms. NO access Spain, Andorra and Germany. Geoblocking must be used. Two games per day allowed up to a maximum of two minutes per clip. Use within 48 hours.
All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Mytishchi Arena, Mytishchi, Moscow Oblast, Russia. 29th October 2019.
Khimki Moscow Region 103 Panathinaikos OPAP Athens 86
1. 00:00 Khimki banner to players shaking hands
First quarter:
2. 00:06 Khimki basket - Devin Booker dunk
3. 00:21 Panathinaikos basket - Nick Calathes lay-up
Second quarter:
4. 00:32 Khimki basket - Alexey Shved three-pointer
5. 00:46 Khimki basket - Jonas Jerebko lay-up
6. 00:59 Panathinaikos basket - Jimmer Fredette lay-up
Third quarter:
7. 01:12 Panathinaikos basket - Ioannis Papapetrou dunk from a Calathes pass
8. 01:23 Replay
Fourth quarter
9. 01:28 Khimki basket - Janis Timma three-pointer
10. 01:41 Khimki basket - Shved jump shot
SOURCE: IMG Media
DURATION: 01:59
STORYLINE:
Alexey Shved led the way with a game-high 26 points as Khimki eased to a 103-86 victory over visitors Panathinaikos in the Euroleague on Tuesday to improve to 4-1.
Last Updated : Oct 30, 2019, 7:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.