కట్టిపడేస్తున్న 'లాంగెస్ట్ స్ట్రీట్ ఆఫ్ ఫ్లవర్స్' - విశాఖలో లాంగెస్ట్ స్ట్రీట్ ఆఫ్ ఫ్లవర్స్ న్యూస్
🎬 Watch Now: Feature Video
అదొక పువ్వుల రహదారి. అటువైపుగా నడుచుకుంటే వెళ్తే.... పుష్పాలు నవ్వులు విరబూస్తూ పలకరిస్తాయి. ఆకట్టుకునే రంగులతో..... అందమైన పూల తొట్టెలతో.... సొగసరిగా మురిపిస్తాయి. పుష్పాల స్వర్గంలో ఉన్నామా అనిపించేలా.... అడుగడుగునా కనువిందు చేసే పూలసొబగుల రమణీయత అక్కడి ప్రత్యేకత. ఇంతకీ ఎక్కడా పూల ప్రపంచం అనుకుంటున్నారా..? విశాఖ సమీపాన.... 'సన్ రే విలేజ్ రిసార్ట్' వేదికగా కొలువుదీరిన లాంగెస్ట్ ఫ్లవర్ స్ట్రీట్ మీకోసం.