అమరావతిలో ఆగ్రహ జ్వాల - అమరావతి ఆందోళనలు
🎬 Watch Now: Feature Video
మూడు రాజధానులు వద్దు... అమరావతే ముద్దంటూ సాగుతున్న ఉద్యమం మరింత ఉద్ధృతమైంది. అమరావతి పల్లెలు రణరంగాన్ని తలపించాయి. ఎక్కడి చూసిన ఖాకీ పహారా మధ్య... పోలీసు బూట్ల చప్పుళ్లే వినిపించాయి. శుక్రవారం రోజున గ్రామదేవతలకు మొక్కులు చెల్లించుకుంటామన్నా బలగాలు అంగీకరించలేదు. ఆగ్రహంతో ఉన్న ప్రజలు... దూసుకెళ్లేందుకు ప్రయత్నించే క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట సాగింది. ఈ పెనుగులాటలో రక్తం చిందింది. పోలీసులు, పాలకుల తీరుపై ప్రజాగ్రహం పెల్లుబికింది.
Last Updated : Jan 10, 2020, 11:09 PM IST