అద్భుతం: సొరచేపల మధ్య స్కూబా డైవింగ్ - జలచరాల పరిరక్షణ కోసం ఓ జీవశాస్త్రజ్ఞుడి వినూత్న ప్రయత్నం
🎬 Watch Now: Feature Video
సముద్రజీవుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వోల్మర్ డి అగ్యుయర్ సాల్వడార్ అనే జీవశాస్త్రజ్ఞుడు వినూత్న ప్రయత్నం చేశారు. శాంటా క్లాజ్ దుస్తులు ధరించి రియోడీజెనీరోలోని ఓ అక్వేరియంలో స్కూబా డైవింగ్ చేశారు. ఆకలిగొన్న సొరచేపల మధ్య ఆయన చేసిన విన్యాసాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది చివరి వరకు ఆయన ఈ విన్యాసాలు చేయనున్నారు. తరువాత ఆయన స్థానంలో మత్స్య కన్యల బృందం ఈ విన్యాసాలు చేస్తుంది.