అంగరంగ వైభవంగా.. శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి రథోత్సవం - goddess Shrikanakamahalakshmi ammavaru in vizag latest news
🎬 Watch Now: Feature Video
ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు. విశాఖ వాసుల కొంగుబంగారమై విరాజిల్లుతున్న శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అమ్మవారిని స్మరిస్తూ పెద్ద ఎత్తున పసుపు జలాలతో కలశాలను, ముడుపులను తలకెత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా జరిగిన ఈ రథోత్సవంలో అమ్మవారి ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించారు. విశాఖ పాతనగరంలో మొదలైన ఊరేగింపు పలు జానపద వేషాలతో ప్రత్యేక అకర్షణగా నిలిస్తూ... ప్రధాన వీధుల మీదుగా ఆలయానికి చేరింది.