ETV Bharat / state

'ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు వైకాపా వ్యతిరేకం' - Triple Talaq bill

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు తమ పార్టీ వ్యతిరేకమని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో స్పష్టం చేశారు. ఈ బిల్లును పునఃపరిశీలించాలని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను కోరారు.

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి
author img

By

Published : Jul 30, 2019, 6:41 PM IST

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు తాము వ్యతిరేకమని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రాజ్యసభలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై మంగళవారం వాడీవేడిగా చర్చ సాగింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై... వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. ట్రిపుల్‌ తలాక్‌ చెప్పడాన్ని నేరంగా పరిగణించడం సరికాదని అభిప్రాయపడ్డారు. బిల్లును మరోసారి పరిశీలించాలని మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను కోరారు.

తలాక్‌ చెప్పిన భర్తకు మూడేళ్లు జైలు శిక్ష విధించడం... అతనికున్న చట్టబద్ధమైన హక్కుకు వ్యతిరేకమని విజయసాయి అభిప్రాయపడ్డారు. జైలుకు పంపడం వల్ల అతడు పునరాలోచించే అవకాశం లేకుండా పోతుందని చెప్పారు. జైలుకెళ్లిన కాలంలో భార్యకు ఏ విధంగా జీవనభృతి అందించగలడని ప్రశ్నించారు. ట్రిపుల్‌ తలాక్‌ సామాజిక సమస్యన్న వైకాపా ఎంపీ... ఈ ప్రక్రియను నేరపూరితంగా మార్చడం వల్ల సమస్యకు పరిష్కారం లభించదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి...

సమస్యల పరిష్కారానికి 'స్పందన' వేదికవ్వాలి: సీఎం జగన్

Mumbai, July 30 (ANI): Bollywood actor Shahid Kapoor was seen post his gym session in Mumbai. Shahid is basking in the success of 'Kabir Singh'. Actor Varun Dhawan was also seen in Juhu outside a gym. Varun will be next seen in 'Street Dancer' alongside Shraddha Kapoor. Meanwhile, actor Swara Bhaskar was also spotted in the city. Swara was last seen in 'Veere Di Wedding'.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.