కడప జిల్లా పెనగలూరు మండలం ఓబిలి గ్రామానికి చెందిన పాపయ్య, రామలక్ష్మమ్మకు నలుగురు సంతానం. వారిలో పెద్ద కుమారుడు ఈశ్వరయ్య, రెండో కుమారుడు మహేశ్వరయ్య. తన ఇంటి ఆవరణలో చెత్త వేశాడని అన్న ఈశ్వరయ్యతో తమ్ముడు గొడవపడ్డాడు. ఆ వాగ్వాదం తారస్థాయికి చేరి ఈశ్వరయ్య తమ్ముడు మహేశ్వరయ్యపై దాడి చేశాడు. రాడ్తో బలంగా కొట్టటంతో మహేశ్వరయ్య కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు.. పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదం