ETV Bharat / state

సీబీఐ దర్యాప్తు కోరడానికి బలమైన కారణాలివే..

author img

By

Published : Jan 30, 2020, 5:34 AM IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ.. ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి హైకోర్ట్‌లో దాఖలు చేసిన వ్యాజ‌్యంలో ఎన్నో అనుమానాలను ప్రస్తావించారు. సీబీఐ దర్యాప్తు కోరడానికి బలమైన పరిస్థితులు, కారణాలను పేర్కొన్నారు. తన తండ్రి మృతిపై పోలీసులు ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాలను చెప్పకపోవడంపైనా సందేహం వ్యక్తం చేశారు.

viveka daughter about cbi investigation
viveka daughter about cbi investigation

తన తండ్రి వైఎస్‌ వివేకా హత్యకేసులో ఎన్నో అనుమానాలున్నాయని హైకోర్ట్‌లో ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ఇటీవల దాఖలు చేసిన వ్యాజ్యంలో ప్రస్తావించారు. హత్య గురించి తనకు తెలియదని కాపలాదారు రంగన్న అంటున్నారని వ్యాజ్యంలో పేర్కొన్నారు. హత్య జరిగిన రోజు రాత్రి అరుపులేమైనా విన్నారా... అనే విషయాన్ని రంగన్న వెల్లడించలేదని వివరించారు. వివేకా తల, శరీరంపై లోతైన గాయాలను చూస్తే..... ఒకరి కంటే ఎక్కువ మందే...గాయపరిచి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు.

రంగన్న ఎలా లోపలికి వెళ్లారు?

కుడిచేతి మీద ఉన్న గాయాన్ని చూస్తే తనపై జరిగే దాడిని అడ్డుకునేందుకు వివేకా యత్నించినట్లు కనిపిస్తోందన్నారు. కాపలాదారు రంగన్న బయట ఉన్నప్పుడు నేరస్థులు ఇంట్లోకి ఎలా వెళ్లగలిగారని వ్యాజ్యంలో ప్రస్తావించారు. రంగన్నకు తెలియకుండా పక్క ద్వారం నుంచి ఎలా తప్పించుకోగలరని.. రంగన్న ఇంటిని చూసుకోకుండా రాత్రి ఎలా నిద్రపోయారనే అనుమానం వ్యక్తం చేశారు. పక్క తలుపులోంచి రంగన్న ఎలా లోపలికి వెళ్లారనే అంశాన్ని వాజ్యంలో లేవనెత్తారు. ఆ తలుపు తెరిచి ఉందని ఆయనకు ఎలా తెలుసు... ఈ చర్యలన్నీ రంగన్న వ్యవహారశైలిని తెలియజేస్తున్నాయని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

ఎందుకు అలా ప్రచారం చేశారు?

ఘటనా స్థలిలో పులివెందుల సీఐ సహా అనేకమంది ఉండగా...సాక్ష్యాలు తుడిపేశారన్న అభియోగంపై ముగ్గురి మీదే ఎందుకు కేసుపెట్టారని.. సునీత వ్యాజ్యంలో ప్రశ్నించారు. వివేకా మృతదేహంపై ఉన్న గాయాలకు సంబంధించి షేక్‌ ఇనయతుల్లా తీసిన ఫోటోలు, వీడియోలు మా దృష్టికి వచ్చే వరకూ గుండెపోటుతో మృతి చెందారని ఎందుకు ప్రచారం చేశారో అర్థం కాలేదన్నారు. పడక, స్నానపు గదిలో రక్తపు మరకలు వివేకా తలపై గాయాలు కనిపించినప్పుడు గుండెపోటుతో మృతి చెందారని టీవీ ఛానళ్లలో ఎలా ప్రసారమైందనే అనుమానం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన రోజు ఉదయం ఎనిమిదిన్నర- తొమ్మిదిన్నర మధ్య ఎఫ్​ఐఆర్​ నమోదైందని వ్యాజ్యంలో పేర్కొన్న సునీత దంపతులు.. అంతకు ముందే ఘటనాస్థలిని సందర్శించిన సీఐ.. అక్కడ రక్తపు మరకలు వివేకా తలమీద గాయాలు చూశారన్నారు. అలాంటప్పుడు తొలుత అనుమానాస్పద మృతి కింద కేసు ఎలా నమోదు చేశారని వ్యాజ్యంలో ప్రశ్నించారు. ఈ సెక్షన్‌ కింద కేసు నమోదు వెనక ఉన్నది ఎవరు, కేసు నమోదు చెయ్యొద్దని ఎర్ర గంగిరెడ్డి ఎందుకు ఒత్తిడి చేశారని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

గాయాలకు కట్లు కట్టాలని ఎందుకు హడావుడి చేశారు?

వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డిలకు అనుచరుడైన డాక్టర్‌ శివశంకర్‌రెడ్డి వివేకా మృతదేహమున్న పడక గదిలో ఎందుకు ఉన్నారని... వ్యాజ్యంలో సునీత దంపతులు సందేహం వ్యక్తం చేశారు. గాయాలకు కట్లు కట్టాలని ఎందుకు హడావుడి చేశారని ప్రస్తావించారు. పడక గది, స్నానాల గదిలోని రక్తపు మరకలను శుభ్రం చేయాలని.. వంట మనిషి లక్ష్మమ్మను ఎర్ర గంగిరెడ్డి ఎందుకు ఆదేశించారని పేర్కొన్నారు. వివేకా మృతదేహం తలపై గాయాలకు కట్లు కట్టడం, మృతదేహాన్ని స్నానపు గది నుంచి పడకగదిలోకి తీసుకురావడం వంటివి జరిగిన సందర్భంలో అనేక మంది వైద్యులు, కుటుంబసభ్యులు ఉన్నప్పుడు సాక్ష్యాధారాలు చెరిపివేశారన్న అభియోగాన్ని వారిపై ఎందుకు మోపలేదని వాజ్యంలో సునీత ప్రస్తావించారు.

బీటెక్‌ రవిని ఎందుకు కలిశారు?

ఇప్పటి వరకు సిట్‌ను 3 సార్లు ఎందుకు మార్చారని సునీత దంపతులు... వ్యాజ్యంలో ప్రశ్నించారు. గతంలో అదనపు డీజీ స్థాయి అధికారి సిట్‌ అధిపతిగా ఉండగా ఇప్పుడు ఎస్పీ స్థాయి అధికారికి ఎందుకు అప్పగించాలని నిలదీశారు. హత్య జరిగి 10 నెలలు గడుస్తున్నా... ఇప్పటి వరకు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆధారాలు, దర్యాప్తు పురోగతి గురించి ఎందుకు మాట్లాడలేదని వ్యాజ్యంలో ప్రస్తావించారు. అనుమానితుల కాల్‌ డేటాలను పోలీసులు పరిశీలించారా? ఈ కేసులో ప్రధాన అనుమానితుడైన కసునూరుకు చెందిన వైకాపా నాయకుడు పరమేశ్వర్‌రెడ్డి హత్య జరిగిన రోజు ఉదయం ఆస్పత్రిలో చేరి.. తర్వాత హరిత హోటల్‌లో తెలుగుదేశం ఎమ్మెల్సీ బీటెక్‌ రవిని ఎందుకు కలిశారని వ్యాజ్యంలో ప్రస్తావించారు.

ఇదీ చదవండి: సీబీఐకి ఎందుకు అప్పగించట్లేదు?: వివేకా కుమార్తె

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.