ETV Bharat / state

ఆదర్శ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య - కడపలో పదవ తరగతిని విద్యార్థిని ఆత్మహత్య వార్తలు

కడప జిల్లా పుల్లంపేట ఆదర్శ పాఠశాలలో విషాదం జరిగింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థిని లక్ష్మీప్రసన్న ఆత్మహత్య చేసుకుంది. వసతి గృహంలో ఫ్యాన్​కు ఉరి వేసుకుంది. విద్యార్థిని మృతికి ఉపాధ్యాయుడు శివ వేధింపులు కారణమనే ఆరోపణలు వినిస్తున్నాయి.

student sucide in model school kadapa district
author img

By

Published : Nov 19, 2019, 11:49 PM IST

ఆదర్శ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

కడప జిల్లా పుల్లంపేట ఆదర్శ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని... లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్య చేసుకుంది. పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థిని... వసతి గృహంలోని ఫ్యాన్​కు ఉరి వేసుకుంది. విషయం తెలుసుకున్న రాజంపేట పట్టణ సీఐ శుభకుమార్, డీఈవో శైలజ, విద్యాశాఖ అధికారులు వసతి గృహానికి చేరుకొని పరిశీలించారు. తోటి విద్యార్థులతో మాట్లాడారు.

వసతి గృహ అధికారిని విచారించారు. పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థిని మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాఠశాలలోని శివ అనే ఉపాధ్యాయుడు 3 నెలలుగా వేధిస్తున్నాడని... ఇదే విషయాన్ని పలుమార్లు పాప తమకు చెప్పిందని లక్ష్మీ ప్రసన్న చిన్నమ్మ ఆరోపించారు.

ఆత్మహత్యపై పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరక్కుండా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థిని వేధించిన ఉపాధ్యాయుడు శివ, పాఠశాల ప్రిన్సిపల్​పై చర్యలు తీసుకోవాలి టీఎన్​ఎస్​ఎఫ్ నేతలు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : మార్కాపురంలో ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య

Intro:Ap_cdp_47_19_vidyarthini_atmahatya_Av_Ap10043
k.veerachari, 9948047582
కడప జిల్లా పుల్లంపేట ఆదర్శ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్య చేసుకుంది. పాఠశాల వెళ్లి తిరిగి వసతి గృహా గదిలోకి వచ్చి గడియ వేసుకున్న విద్యార్థిని ఎంతసేపు కాకపోవడం.. అంతలో అక్కడికి వచ్చిన తల్లి, అక్కడ ఉన్న విద్యార్థినులు తలుపు తీసే ప్రయత్నం చేశారు అప్పటికే విద్యార్థిని గదిలో ఉన్న ఫ్యాన్ కి ఉరి వేసుకుని మృతి చెందినట్టు గుర్తించారు. అనంతరం తలుపు తీసి మృతదేహాన్ని కిందికి దింపారు. ఈ విషయం తెలుసుకున్న రాజంపేట పట్టణ సీఐ శుభకుమార్, డీఈఓ శైలజ, ఇతర విద్యాశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తోటి విద్యార్థులతో మాట్లాడారు. వసతి గృహ అధికారిన్ని విచారించారు. పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థిని మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాఠశాలలోని శివ అనే ఉపాధ్యాయుడు మూడు నెలలుగా వేధిస్తూ వచ్చాడని ఇదే విషయాన్ని పలుమార్లు మా పాప చెప్పిందని లక్ష్మీ ప్రసన్న పిన్నమ్మ ఆరోపించారు. ఇదే విషయాన్ని పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరక్కుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ స్పందిస్తూ విద్యార్థిన్ని వేధించిన ఉపాధ్యాయుడు శివ, ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ కష్టం వచ్చింది తల్లి నీకు అంటూ విద్యార్థుల తల్లి గౌరీ విలపించారు ఆమె రోదన వర్ణనాతీతంగా మారింది ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కూడా అక్కడికి చేరుకొని విద్యార్థి మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చిన్న బిడ్డ కి ఎంత కష్టం వచ్చిందంటే కన్నీళ్లు పెట్టుకున్నారు.

Body:ఆదర్శ పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య

Conclusion:కడప జిల్లా రాజంపేట

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.