ETV Bharat / state

'ఆంధ్రప్రదేశ్​ను "ఆంగ్ల"ప్రదేశ్​గా మార్చాలనుకుంటున్నారు' - జీవో 81 న్యూస్

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎనిమిదో తరగతి వరకూ ఆంగ్ల బోధన అమలు చేయాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై పీసీసీ ఉపాధ్యక్షుడు తులసీరెడ్డి మండిపడ్డారు. మాతృభాషను మృతభాషగా మార్చడానికి వైకాపా సర్కార్‌ ప్రయత్నిస్తోందని విమర్శించారు.

తులసిరెడ్డి
author img

By

Published : Nov 6, 2019, 6:21 PM IST

'ఆంధ్రప్రదేశ్​ను "ఆంగ్ల"ప్రదేశ్​గా మార్చాలనుకుంటున్నారు'

ఆంధ్రప్రదేశ్​ను ఆంగ్లప్రదేశ్​గా మార్చాలని వైకాపా ప్రభుత్వం చూస్తోందని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసీరెడ్డి అన్నారు. సర్కార్ బడుల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం దారుణమని విమర్శించారు. కడప జిల్లా వేంపల్లిలో మాట్లాడిన ఆయన.. పొరుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాలు వారి మాతృ భాషను కాపాడుకోవడానికి కృషి చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం పనికట్టుకుని మాతృభాషను హత్య చేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తెలుగుభాష కాలగర్భంలో కలిసిపోతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా ఈ జీవోను వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

పాపం పులి... ఎరక్కపోయి ఇరుక్కుపోయింది

ఇక.. ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​లో చేనేత వస్త్రాలు

ఆంధ్ర ప్రదేశ్ ను ఆంగ్ల ప్రదేశ్ గా మార్చాలని అని సడన్ అవివేకం మూర్ఖత్వమని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ మండల పరిషత్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఒకటవ తరగతి నుండి అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్ మీడియం గా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయము తీసుకోవడం అలాగే నిన్నటి రోజు జీవో 81 నీ రిలీజ్ చేయడం అనేది చారిత్రాత్మక తప్పిదమని యాంకర్ వాయిస్ :: కడప జిల్లా వేంపల్లి లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో లో పిసిసి ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఒకరకంగా అ జగన్ ప్రభుత్వం వన్ తెలుగు భాషను హత్య చేయడమే అని అని పురుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాలు వారి వారి భాష కోసం ఆహర్ష లు కృషి చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వన్ పనికట్టుకుని మాతృభాషను సమూలంగా హత్య చేయడం జీవో జారీ చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. తెలుగు భాష తల్లి లాంటిదని ఆంగ్ల భాష ఆయా లాంటిదని అయ్యాను మనం గౌరవించాలి కానీ అమ్మను అంతకంటే ఎక్కువగా గౌరవించాలే తప్ప ఆయా కోసం అమ్మను చంపు కుందామా అని ప్రశ్నించారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేసింది కూడా అంతే అన్నారు. 4 అమెరికా ఉద్యోగాల కోసం మతం తెలుగు భాషను జగన్ ప్రభుత్వం నాశనం చేస్తుందని తులసి రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల రేపు అనేకమంది బడి మానేస్తారని అన్నారు అలాగే తెలుగుభాష కాలగర్భంలో కలిసిపోతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా ఈ దురాలోచన మానుకొని జీవన్ వెనక్కు తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.