వైయస్ వివేకా హత్య కేసు విచారణలో... సిట్ అధికారులు వేగం పెంచారు. మూడు రోజుల నుంచి... వైకాపా, తెలుగుదేశం పార్టీల వారిని విచారణకు పిలుస్తున్న సిట్... నేడు తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారణకు రావాలని సమాచారం అందించారు. ఉదయం 10 గంటలకు కడపకు చేరుకుని.... విచారణకు ఆయన హజరుకానున్నారు.ఈ కేసులో అనుమానితులుగా ఉన్న ప్రకాశ్,ప్రసాద్ సహా మరో ఇద్దరిని సిట్ బుధవారం విచారించింది. వీరిలో జిల్లాకు చెందిన ఓ మాజీమంత్రి కారు డ్రైవర్లు ఇద్దరు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. పలువురు ఇతర ప్రముఖులనూ విచారణకురావాలని సిట్ కోరనున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి