కడప జిల్లా శివారులోని పారిశ్రామిక వాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా... మరో బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక శివానందపురానికి చెందిన రాజేంద్రప్రసాద్ టైలర్ పని చేస్తున్నాడు. తన ఆరేళ్ల పాప రిషికను పాఠశాల నుంచి తీసుకు వస్తుండగా కారు డ్రైవర్ అతివేగంగా వచ్చి వీరి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయమై రాజేంద్రప్రసాద్ చనిపోయాడు. ఇటీవలే అతని భార్య అనారోగ్యంతో మృతి చెందింది. పిల్లలు అనాథలయ్యారని బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఇవీ చదవండి