కడప జిల్లాలోని కేసీ కాలువ రైతుల కష్టాలు తీర్చేలా... కర్నూలు, కడప జిల్లాల సరిహద్దులోని 2.95 టీఎంసీల సామర్థ్యంతో రాజోలి జలాశయం నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ నెల 24న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో రాజోలి జలాశయం నిర్మాణానికి శంకుస్థాపన చేయగా... నిర్మాణానికి నోచుకోలేదు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు...ప్రభుత్వం రాజోలి జలాశయం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. రూ.830 కోట్ల వ్యయంతో జలాశయం నిర్మాణ పనులు చేపటనున్నట్లు అధికారులు వివరించారు.
ఇదీ చదవండి: భోజనం అని పిలుస్తారు... పేద వారి ఆకలి తీరుస్తారు..!