ETV Bharat / state

లోపమే శాపమై.. రైలు ఢీకొని బధిరుడు మృతి - dumb and def person died at rajampeta

ఆ వ్యక్తికి ఉన్న లోపమే అతని ప్రాణాలు తీసింది. బధిరుడైన రవి అనే వ్యక్తి రైలు వస్తున్న శబ్ధం వినిపించక పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కడప జిల్లా రాజంపేటలో జరిగింది.

రైలు ఢీకొట్టి బధిరుడు మృతి
author img

By

Published : Nov 25, 2019, 1:46 PM IST

బధిరుడైన ఆ వ్యక్తికి తన లోపమే శాపంగా మారింది. రైలు వస్తున్నా.. ఆ శబ్దం వినిపించక పట్టాలు దాటడానికి ప్రయత్నించాడు. వేగంగా వస్తున్న రైలు ఢీకొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయవిదారక ఘటన కడప జిల్లా రాజంపేట రైల్వే గేటు వద్ద జరిగింది. తుమ్మల అగ్రహారానికి చెందిన రవికి మూగ, చెవుడు. భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. పని కోసమని రాజంపేట వచ్చాడు. రైల్వేగేటు వద్ద వస్తున్న రైలును గమనించక పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగింది. మృతుడికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలున్నారు. స్టేషన్ వద్ద ఉన్న అండర్ బ్రిడ్జి పూర్తికాకపోవటం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

రైలు ఢీకొట్టి బధిరుడు మృతి

ఇదీ చదవండి: రాచాయిపేటలో రోడ్డు ప్రమాదం... బాలిక మృతి

Intro:Ap_cdp_47_25_railu deekoni_vyakthi mruthi_Av_Ap10043
k.veerachari, 9948047582
కడప జిల్లా రాజంపేట రైల్వే గేటు వద్ద రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. స్థానిక తుమ్మల అగ్రహారానికి చెందిన రవి అనే వ్యక్తి సైకిల్తో రైలు పట్టాలు దాటుతుండగా రేణిగుంట వైపు నుంచి వేగంగా వస్తున్న సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి మూగి, చెవుడు కావడంతో రైలు వస్తున్న శబ్దాన్ని గ్రహించలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికంగా బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రవికి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రాజంపేట రైల్వే స్టేషన్ వద్ద RUB పూర్తికాని కారణంగా ప్రజలు రైలు పట్టాలు దాటి వెళ్తుండటంతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.


Body:రైలు ఢీకొని వ్యక్తి మృతి


Conclusion:కడప జిల్లా రాజంపేట

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.