కడప జిల్లా యోగివేమన విశ్వవిద్యాలయంలో ప్రసన్న భారతి అనే మహిళా ఉద్యోగిని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన తోటి సిబ్బంది ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే వర్శిటీ వీసీ వేధింపుల వల్లే తన కుమార్తె చనిపోయేందుకు యత్నించిందని బాధితురాలి తండ్రి ఆరోపించాడు. తన కుమార్తెను అకారణంగా వేరే విభాగానికి బదిలీ చేశారని వాపోయారు.
ఇదీ జరిగింది
యూనివర్శిటీలో ప్రసన్నభారతి 15 ఏళ్లుగా క్లర్క్‌గా విధులు నిర్వర్తిస్తుంది. ఉపకులపతి రామకృష్ణారెడ్డి...ఆమెను ప్రొద్దుటూరుకు బదిలీ చేశారు. ఈ విషయంపై వీసీని కలిసి... తన సమస్యను విన్నవించుకుంది. తనకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని, అనారోగ్యంగా ఉందని చెప్పింది. కొద్ది నెలల కిందట ఆమెను జెనెట్సిక్ విభాగానికి బదిలీ చేశారని... ఇప్పుడు మళ్లీ ప్రొద్దుటూరుకు ఆకస్మాత్తుగా బదిలీ చేస్తే ఇబ్బందిగా ఉంటుందని తెలిపింది. అయినా ఉపకులపతి పట్టించుకోలేదని బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ మనస్తాపంతోనే నిద్రమాత్రలు మింగిందని వాపోయారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని ఎస్సీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: