ETV Bharat / state

'తెలుగు భాషను విస్మరించే ప్రసక్తే లేదు' - minister adhimulapu suresh news in kadapa

కడపలో అగ్రిగోల్డ్ బాధితుల ఆపన్నహస్తం కార్యక్రమానికి విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేశ్ హాజరయ్యారు. తెలుగు భాష వికాసానికి ప్రభుత్వం కట్టుబడే ఉందని మంత్రి స్పష్టం చేశారు.

బాధితులకు చెక్ అందిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేశ్
author img

By

Published : Nov 7, 2019, 4:43 PM IST

తెలుగు భాషను విస్మరించే ప్రసక్తే లేదు..

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. కడప అగ్రిగోల్డ్ బాధితుల ఆపన్నహస్తం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మారుతున్న కాలంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని అందరూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు భాషా వికాసానికి ప్రభుత్వం కట్టుబడే ఉందని మంత్రి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం తెలుగు అకాడమీ ఏర్పాటు చేయడమే కాకుండా ఛైర్ పర్సన్ ను కూడా నియమించిందని గుర్తు చేశారు. 2006లోనే గత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సక్సెస్ స్కూల్ పేరుతో పాఠశాలల్లో ఆంగ్ల బోధన ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలుగు భాషను విస్మరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇదీచూడండి.డీటీడీసీ కొరియర్ వాహనంలో చోరీ

Intro:Body:

ap_cdp_01_07_education_minister_on_telugu_basha_avb_3067319_0711digital_1573114365_337

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.