తాగు, సాగు నీటి అవసరాలు తీర్చేందుకు నీటి పారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వరుణుడు కరుణించగా.. ఈ ఏడాది కడప జిల్లాలోని దిగువ సగిలేరు ప్రాజెక్టుకు తెలుగుగంగ ప్రాజెక్టు నుంచి నీటిని వదిలారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు దిగువ సగిలేరు కింద ఉన్న చెరువుల్లో జలకళ ఉట్టిపడుతోంది. కుడి, ఎడమ కాలువలకు సంబంధించి 36 గొలుసు చెరువులు ఉన్నాయి. దాదాపు 18వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇటీవల అధికారులు బద్వేలు నియోజకవర్గంలోని బి.కోడూరు మండల పరిధిలోని చెరువులకు ఎడమ కాలువ ద్వారా నీటిని మళ్లించారు. ఇప్పటికే పలు చెరువులు నిండాయి. కరవు రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు.
ఇవీ చదవండి: