బస్సుల్లో ప్రయాణించే వారే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలు కడప జిల్లా బద్వేలు పోలీసులకు చిక్కారు. వారి నుంచి 3 లక్షల 27 వేల రూపాయలు విలువచేసే బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన రేవతి, లక్ష్మీ అనే ఇద్దరు మహిళలు.. వివిధ ప్రాంతాల్లోని ఆర్టీసీ బస్టాండ్లలో దొంగతనాలకు పాల్పడేవారు. ప్రయాణికుల సంచుల నుంచి బంగారు ఆభరణాలను దోచుకునేవారు. బద్వేలు పట్టణ పోలీసులు ఆర్టీసీ బస్టాండ్లో నిఘా పెట్టి ఇద్దరినీ అరెస్టు చేసినట్టు మైదుకూరు డీఎస్పీ విజయకుమార్ తెలిపారు.
ఇదీ చదవండి