మూడు రాజధానుల బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని వైకాపా శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. కర్నూలుకు హైకోర్టును తీసుకొచ్చినందుకు రాయలసీమ ప్రజలు ముఖ్యమంత్రికి రుణపడి ఉంటారని.. వైకాపా నేత అహ్మద్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కడప ఏడురోడ్ల కూడలిలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందని... అమరావతిని అభివృద్ధి చేస్తే లక్షల కోట్లు వెచ్చించాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:
రాయలసీమ ప్రజలుగా... సీఎంకు రుణపడి ఉంటాం - కర్నూలుకు హైకోర్టును ఇవ్వటంపై కడప వైకాపా నేతలు సంబరాలు
మూడు రాజధానుల విషయంలో ముఖ్యమంత్రి సరైన నిర్ణయం తీసుకున్నారంటూ కడపలోని వైకాపా నేతలు.. బాణసంచా కాలుస్తూ హర్షం వ్యక్తం చేశారు. కర్నూలుకు హైకోర్టును కేటాయించినందుకు...తాము సీఎంకు రుణపడి ఉంటామని రాయలసీమ ప్రజలు అన్నారు.
మూడు రాజధానుల బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని వైకాపా శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. కర్నూలుకు హైకోర్టును తీసుకొచ్చినందుకు రాయలసీమ ప్రజలు ముఖ్యమంత్రికి రుణపడి ఉంటారని.. వైకాపా నేత అహ్మద్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కడప ఏడురోడ్ల కూడలిలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందని... అమరావతిని అభివృద్ధి చేస్తే లక్షల కోట్లు వెచ్చించాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:
Byte- 1-కల్లూరు చంద్రబాబు రెడ్డి- మండల కన్వీనర్ వైఎస్సార్సీపీ -వేంపల్లి