ETV Bharat / state

ఖైదీల పిల్లలకు ఖాకీల రక్షణ

author img

By

Published : Nov 30, 2019, 9:52 AM IST

పిల్లలను చక్కగా తయారు చేసి... డబ్బాలో భోజనం సర్ది తల్లో.. తండ్రో పాఠశాలలో వదిలి పెడతారు. కాని వీరిని మాత్రం జైలు అధికారులు రోజూ అంగన్వాడీ కేంద్రంలో జాగ్రత్తగా వదిలిపెట్టి... సాయంత్రం మళ్లీ జాగ్రత్తగా తీసుకొస్తారు... ఇదేమిటీ అనుకుంటున్నారా.... అయితే ఈ కథ చదివేయండి..!

jailers taking prisoners children to school at kadapa
ఖైదీల పిల్లలకు ఖాకీల రక్షణ

క్షణికావేశంలో చేసిన నేరాలు ఆ తల్లులను... కన్న పిల్లలకు దూరం చేశాయి. పిల్లల ఆలనాపాలనా చూసుకునే సమయంలో జైలు పాలయ్యారు. కారాగారంలో అనుభవించే శిక్ష ఒక వైపు... తమ చిన్నారులు ఇంట్లో ఎలా ఉన్నారనే ఆలోచన మరోవైపు వారిని ఆవేదనకు గురిచేసింది. కడప కేంద్ర కారాగారంలో ఇలాంటి ముగ్గురు తల్లులు జైలు అధికారులకు తమ దుస్థితిని విన్నవించటంతో పిల్లల్ని తల్లుల వద్ద ఉండడానికి అధికారులు అనుమతిచ్చారు. పిల్లల ఆలనాపాలనా తల్లులే చూసుకుంటారు. ప్రతి ఉదయం ఆ చిన్నారులను మహిళా పోలీసులే బాలబడికి తీసుకువెళ్లి తిరిగి జైలుకు తీసుకువస్తున్నారు. చిన్నారులకు ఆరేళ్ల వయస్సు వచ్చే వరకు తల్లుల వద్ద ఉండవచ్చు. తర్వాత వారి బంధువులకు అప్పగిస్తారు. మహిళా కేంద్ర కారాగార సిబ్బంది ఆ ముగ్గురు పిల్లలను సొంత బిడ్డల్లా చూసుకుంటుండటం విశేషం.

ఇదీ చదవండి:

'నిర్భయ' వచ్చినా ఏది భయం

Intro:ap_cdp_17_25_jail_nuchi_school_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంప్యూటర్, కడప.
note: సార్.. ఒకసారి పరిశీలించి వాడుకోగలరు.

యాంకర్:
పిల్లలందరూ వారి వారి నివాసాలను నుంచి పాఠశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్తారు. కానీ ఇక్కడున్న పిల్లలు మాత్రం జైలు నుంచి ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రానికి వెళుతుంటారు. ఇదేమిటి అనుకుంటున్నారా.. అవునండి ఇది నిజం.. క్షణికావేశంలో నేరాలు చేసి శిక్షణ నిమిత్తం కడప ప్రత్యేక మహిళా కేంద్ర కారాగారానికి వచ్చారు. వీరు కేంద్ర కారాగారానికి వచ్చేముందు పిల్లలను ఇంటివద్ద వదిలేసి వచ్చారు. కొద్దిరోజుల ముగ్గురు మహిళా ఖైదీలు తమ చిన్న పిల్లలు ఇంటి వద్ద ఉన్నారు. వారిని తమ వద్దకు తెచ్చు కుంటామని జైలు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. అధికారులు మానవతా దృక్పథంతో అనుమతి ఇవ్వడంతో ముగ్గురు మహిళా ఖైదీలు వారి పిల్లలను జైలుకు తీసుకొచ్చి తమ వద్ద ఉంచుకున్నారు. వారి యోగక్షేమాలను తల్లులే చూసుకుంటున్నారు. ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని ఆ ముగ్గురు పిల్లలను సమీపంలోని అంగన్వాడీ కేంద్రాలకు జైలు సిబ్బంది దగ్గరుండి తీసుకెళ్ళి తిరిగి తీసుకు వస్తున్నారు. ఈ పిల్లలకు ఆరేళ్లు వయస్సు వచ్చేంత వరకు తల్లి వద్దే ఉంటారు. తర్వాత వారి బంధువులకు అప్పగిస్తారు.

Body:జైలు నుంచి అంగన్వాడీ కేంద్రాలకు

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.