కడప జిల్లా బద్వేలు పట్టణ గ్రామ శివార్లలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో... ఇద్దరు వ్యవసాయ కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బద్వేల్ భారత్ పెట్రోల్ బంకు వద్ద రమణయ్య, లక్ష్మీపాలెం వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో శేషయ్య అనే వ్యవసాయ కూలీలు తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డు ప్రమాద ఘటనలకు సంబంధించి బద్వేల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రమాదవశాత్తు బస్సు కిందపడి విద్యార్థిని మృతి