ETV Bharat / state

ఈ ప్రభుత్వ పాఠశాల... ట్రిపుల్​ ఐటీ ర్యాంకుల అడ్డా..!

author img

By

Published : Nov 30, 2019, 5:39 PM IST

ప్రభుత్వ పాఠశాలలో చదువంటే అంతంతమాత్రం అనుకునే రోజులివి. ఇది నిజం కాదు... పట్టుదల ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లోనూ అద్భుతాలు సృష్టించవచ్చని ఈ విద్యార్థులు, ఉపాధ్యాయులు నిరూపిస్తున్నారు. ట్రిపుల్ ఐటీలో ర్యాంకులు సాధిస్తూ... అందరి మన్ననలు పొందుతున్నారు. కడప జిల్లాలోని ఈ పాఠశాల విజయాలు... ఇతర బడులకూ స్ఫూర్తినిస్తున్నాయి.

government school story at kadapa dst obulavaripalli
ట్రిబుల్ ఐటీ ర్యాంకులో దూసుకెళుతున్న ప్రభుత్వ పాఠశాల

ఈ ప్రభుత్వ పాఠశాల... ట్రిపుల్​ ఐటీ ర్యాంకుల అడ్డా..!

కడప జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. ఈ బడిని 1958లో స్థాపించారు. విశాలమైన ఆటస్థలం, తరగతి గదులతోపాటు... నిపుణులైన ఉపాధ్యాయ బృందం... అక్కడి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు మూలస్తంభాలుగా నిలుస్తున్నాయి.

2015 వరకు ఈ పాఠశాలలో అంతంత మాత్రంగానే ఫలితాలు వచ్చాయి. ఆ సమయంలో ప్రధానోపాధ్యాయుడిగా వచ్చిన వేణుగోపాలస్వామి, సిబ్బందితో కలిసి... పాఠశాల తీరును మార్చారు. ముందుగా పాఠశాలను సుందరీకరించారు. జాతీయ నేతల చిత్రపటాలు, సైన్స్ పరికరాలు, ప్రపంచ పటాలను గొడలపై చిత్రీకరింపజేసి... విద్యార్థుల్లో ఉత్తేజాన్ని కలిగించారు. ప్రయోగశాలలు, గ్రంథాలయం, వీడియో పాఠాలు అందుబాటులోకి తెచ్చారు.

ప్రత్యేక స్టడీ అవర్స్​తో విద్యార్థుల ప్రతిభకు మెరుగులు దిద్దారు. ఫలితంగా... చదువుతోపాటు, క్రీడల్లోనూ విద్యార్థులు అత్యున్నత ప్రతిభ ప్రదర్శించారు. ట్రిపుల్ ఐటీలో జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించి గుర్తింపు పొందారు. వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

మంచి ఫలితాలు సాధిస్తున్నా... ఈ పాఠశాలకు కొన్ని సమస్యలున్నాయి. విద్యార్థులకు మినరల్ వాటర్, గ్రంథాలయంలో మరిన్ని పుస్తకాలు, కంప్యూటర్లు... వీటికి మించి నూతన భవనాలు అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇవి పూర్తయితే.. కార్పొరేట్ పాఠశాలలను మించిన ఫలితాలు సాధిస్తామని ఉపాధ్యాయులు, విద్యార్థులు చెబుతున్నారు.

ఇదీ చూడండి

ఫాస్టాగ్‌ తీసుకో.. సమయం ఆదా చేసుకో..

sample description

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.