పార్టీలు మారినా, పాలకులు మారినా, గిరిజనులు బతుకులు మారటం లేదు. కడప జిల్లాలోని కండ్రిక పంచాయితి పరిధి అయిన సిద్దేశ్వరపురం గత 25సంవత్సరాలుగా అభివృద్దికి నోచుకోక గుడిసెలకే పరిమితమైంది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరికి ఇల్లు కట్టుకునే స్తోమత లేదు. ఇక్కడి పిల్లలు స్కూల్కు వెళ్లాలంటే పక్కూరుకు పోవాల్సిందే. వర్షాకాలం గుడిసెలు కూలిపోతాయోమోనని.. ఎండాకాలం ఎక్కడ నిప్పుంటుకుని తగలడిపోతాయోమో అని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు అక్కడి గిరిజనులు. 60ఏళ్లు నిండినా పింఛన్ రాదు. ఎందుకంటే వారికి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు సైతం లేవు. ప్రభుత్వ పెద్దలు కరుణించి ఇల్లు కట్టించి, గ్రామంలో రోడ్డు వేయాలని వీరు కోరుకుంటున్నారు.
అభివృద్ధికి పట్టం కడుతున్నామనే పాలకుల వాగ్దానాలు వీరి విషయంలో మాటలకే పరిమితమయ్యాయి. పేదవారికి అండగా ఉంటామన్న నాయకులు ఊరి పొలిమేరలోనే ఆగిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తే వారి బతుకుల్లో వెలుగులు నింపిన వారవుతారని స్థానికులు అంటున్నారు.
ఇదీ చూడండి దిల్లీ 'జామియా' ఘటనలో 10 మంది అరెస్టు