కడప జిల్లాలోని ప్రఖ్యాత పర్యటక ప్రాంతమైన గండికోట ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆదివారం రాత్రి 10 గంటల వరకు వేడుకలు కొనసాగాయి. రెండో రోజు ప్రజలు గండికోటకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లోనే సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హరితేజ, అనిల్ వ్యాఖ్యాతలుగా ఆకట్టుకున్నారు. నృత్య ప్రదర్శన అలరించింది. లేజర్ షో ద్వారా ఒంటిమిట్ట ఆలయం చరిత్రను తనికెళ్ల భరణి వాయిస్ ఓవర్‌తో ప్రదర్శించారు.
ఇవీ చదవండి: