కడప డీఎస్పీ కార్యాలయానికి నిత్యం 50 మందికి పైగా ఫిర్యాదుదారులు వస్తుంటారు. డీఎస్పీ వారి సమస్యలు విని పరిష్కారం సూచిస్తారు. అయితే ఇదంతా అయ్యేసరికి రెండు మూడు గంటల సమయం పడుతుంది. ఒక్కోసారి రోజంతా బాధితులు అక్కడే ఉండాల్సిరావచ్చు. అందుకే వారికోసం డీఎస్పీ తన సొంత ఖర్చుతో భోజన ఏర్పాట్లు చేశారు. ఫిర్యాదులు చేయడానికి అక్కడకి వచ్చేవారు కడుపునిండా అన్నం తిని వెళ్లవచ్చు. స్పందన కార్యక్రమానికి ఎక్కువగా మధ్య, నిరుపేద వర్గాల వారు వస్తారనీ.. బయట భోజనం చేసేందుకు వారివద్ద డబ్బులు ఉండవనీ.. అందుకే ఈ ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ వివరించారు. సమస్యకి పరిష్కారం దొరికినా.. దొరకకపోయినా కడుపునిండా భోజనం పెడుతున్నారని బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి..