కడప జిల్లా గోపవరం పంచాయతీ పరిధిలోని పురపాలిక డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు సిగరేట్ తాగి పడేయడంతో అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదంపై పురపాలక అధికారులకు సమాచారం అందించినా ఆలస్యంగా స్పందించారు. అప్పటికే చాలా వరకూ చెత్త తగలబడి దట్టమైన పొగలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున చెత్త తగలబడటంతో మంటలను అదుపుచేయడం కష్టంగా మారింది. పురపాలక అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో చిన్నపాటి మంటలు పెద్దగా వ్యాపించాయని రైతులు మండిపడుతున్నారు.
ఇవీ చూడండి...