కర్నూలు జిల్లా రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లి పంచాయతీ, జ్యోతి నగర్ సమీపంలో ఓ రైతు వినూత్న కార్యక్రమం చేపట్టాడు. వల లాంటి సంచులు తయారు చేసి తన పంట పొలంలోని మామిడి మెుక్కలకు తొడుగులు వేశాడు. చలికాలంలో వచ్చే చీడపీడలను కాపాడడమే కాకుండా... మామిడి మొక్కకు వచ్చే రసం పీల్చే పురుగుల బారి నుంచి ఈ తొడుగులు కాపాడతాయని రైతు తెలిపారు. చలికాలంలో ఎక్కువగా ఆకులు ముడుచుకు పోకుండా ఉండేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని.... దీనివల్ల మొక్క ఎదుగుదల బాగుంటుందని వివరించారు. ఎండ, వాన నుంచి రక్షణ ఇవ్వడమే కాకుండా... పశువుల బారి నుంచి ఈ తొడుగులు రక్షిస్తాయని తెలిపారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల రైతులు ఇటువంటి తొడుగులు తమ పొలంలో వేసుకునేందుకు సమాయత్తమవుతున్నారు.
ఇదీ చూడండి: అతి తక్కువ ధరకే మామిడి నిమ్మ మెుక్కలు ఎక్కడో తెలుసా...