వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో మాజీమంత్రి ఆదినారాయణరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. జమ్మలమడుగు మండలం దేవగుడిలో ఆదినారాయణరెడ్డికి నోటీసులు ఇచ్చిన సిట్... రేపు ఉదయం 11 గంటలకు కడపలో విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. సిట్ నోటీసులపై ఆదినారాయణరెడ్డి స్పందించారు. రేపు సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరవుతానని చెప్పారు. ఇవాళ ఉదయం 8 గంటలకు నోటీసులు అందాయన్న మాజీమంత్రి... వివేకా హత్యకేసుతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనకు సంబంధం ఉందని తేలితే బహిరంగంగా ఉరివేసుకుంటానని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండీ...