కడప జిల్లా చాపాడు మండలం సీతారామపురం వద్ద కుందూ నదిపై నిర్మించిన వంతెన దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. 10 గ్రామాలకు చెందిన ప్రజలు ఈ వంతెన నుంచే రాకపోకలు కొనసాగిస్తుంటారు. బ్రిటీషు హయాంలో నిర్మించిన ఈ వంతెన ఇప్పుడు పెచ్చులూడి, ఇనుప కడ్డీలతో దర్శనమిస్తోంది. ప్రమాదకరంగా మారిన ఈ బ్రిడ్జిని అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. వంతెనకు ఏర్పాటు చేసిన రక్షణ దిమ్మలు కొన్నిచోట్ల ఒరిగి ఉన్నాయనీ, వంతెనపై ప్రయాణించాలంటేనే భయాందోళనకు గురవుతున్నామని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వంతెనను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి : ప్రొద్దుటూరు ఏటీఎంలలో చిరిగిన నోట్లు... ఆందోళనలో ప్రజలు