ETV Bharat / state

కడప స్టీల్‌ ప్లాంట్‌కు డిసెంబరు 26న శంకుస్థాపన : సీఎం జగన్ - cm jagan

కడప జిల్లాలో పర్యటిస్తోన్న సీఎం జగన్...జమ్మలమడుగు బహిరంగసభలో పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం అవినీతి రహిత పాలన వైపు అడుగులు వేస్తోందన్నారు. గ్రామవాలంటీర్లు ప్రభుత్వ సంక్షేమపథకాలను నేరుగా లబ్దిదారుల ఇంటికే తెచ్చిస్తారని తెలిపారు.

సున్నా వడ్డీకే రైతు రుణాలు : సీఎం జగన్
author img

By

Published : Jul 8, 2019, 9:00 AM IST

Updated : Jul 8, 2019, 3:31 PM IST

కడప గడప నుంచి నవరత్నాల అమలుకు మరొకసారి శ్రీకారం చుడుతున్నామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు బహిరంగ సభలో మాట్లాడిన సీఎం...ప్రమాణం చేసిన నెలలోపే వృద్ధాప్య పింఛన్‌ను రూ.2250 పెంచామని తెలిపారు. ఇక నుంచి వైఎస్‌ఆర్‌ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తామని జగన్ అన్నారు. వైకాపా ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే ఉందన్న సీఎం జగన్‌...రైతుల కోసం వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ అనే పథకాన్ని తీసుకొచ్చామని స్పష్టం చేశారు.

సున్నా వడ్డీకే రైతు రుణాలు: సీఎం జగన్

ప్రభుత్వపథకాలు నేరుగా ఇంటికే

నెల కూడా తిరగకుండా వైకాపా సర్కార్ పింఛన్ల కోసం రూ.15,675 కోట్లు ఖర్చు చేసిందన్నారు సీఎం జగన్‌. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తలుపు తట్టి పింఛను ఇస్తామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 1 తేదీ నుంచి గ్రామ వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను.. ఇంటికి వచ్చి వివరిస్తారన్నారు. గ్రామ వాలంటీర్లు ఎవరూ లంచం తీసుకోరని స్పష్టం చేశారు. గ్రామ వాలంటీర్లు ఎవరైనా లంచం తీసుకుంటే నేరుగా సీఎం కార్యాలయానికే ఫిర్యాదు చేయవచ్చన్నారు.

ఏడాదికి 84 వేల కోట్ల రుణాలు

రైతు రుణాల కోసం ఈ ఏడాదికి 84 వేల కోట్లు మంజూరు చేస్తామన్న సీఎం జగన్‌..సకాలంలో రుణాలు చెల్లించిన రైతులు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల హామీ ప్రకారం రైతులకు పగటిపూటే 9 గంటల విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. 60 శాతం ఫీడర్లు ఉచితంగా పగటిపూట 9 గంటల విద్యుత్‌ సరఫరాకు అవకాశం ఉందన్నారు. ఆక్వా రైతులకు విద్యుత్‌ రూ.1.50 సరఫరా చేస్తున్నమని ప్రకటించారు. రైతులకు గిట్టుబాటు ధరల కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తామని సీఎం జగన్‌ హామీఇచ్చారు.

రైతు భరోసా...70 లక్షల రైతులకు

తుపాన్లు వచ్చినప్పుడు రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి రాయితీలను గత ప్రభుత్వం ఇవ్వలేదని సీఎం జగన్ చెప్పారు. ఆ బకాయిలను ఇప్పుడు చెల్లిస్తున్నామన్నారు. వ్యవసాయ ట్రాక్టర్లపై రోడ్డు పన్ను రద్దుచేశామన్న జగన్....వ్యవసాయంలో దశ, దిశ ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. రైతుకు జరగరానిది జరిగితే రూ.7 లక్షలు చెక్కు అందిస్తామని సీఎం ప్రకటించారు. రైతులకు విపత్తు సహాయనిధి కింద రూ.2 వేల కోట్లు కేటాయించినట్టు సీఎం తెలిపారు. అన్నదాతలకు తోడుగా ఉండేందుకే వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం రూపొందించామన్నారు. వచ్చేఏడాది ఇవ్వాల్సిన పథకాన్ని 7 నెలల ముందే రైతులకు అందుబాటులోకి తెచ్చారమన్నారు. రైతు భరోసా కింద 70 లక్షలమంది రైతులకు రూ.8,750 కోట్లు అందిస్తామన్నారు.అక్టోబర్ 15 రైతు భరోసా అందిస్తామని ప్రకటించారు. గోదావరి నీటిని శ్రీశైలానికి తీసుకొచ్చి రాయలసీమ, ప్రకాశం జిల్లాకు నీళ్లిస్తామని సీఎం చెప్పారు.

సున్నా వడ్డీకే రైతు రుణాలు: సీఎం జగన్

కడప స్టీల్ ప్లాంట్

కడప స్టీల్‌ ప్లాంట్‌కు డిసెంబరు 26న శంకుస్థాపన చేస్తామని సీఎం జగన్ తెలిపారు. ప్లాంట్​ను మూడేళ్లలో పూర్తి చేసి అందిస్తామన్నారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ పూర్తయితే 20 వేల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు.

కుందూ నదిపై రాజోలు, జలదరాశి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ రెండు ప్రాజెక్టులకు డిసెంబరు 26న శంకుస్థాపన చేస్తామన్నారు. గండికోట జలాశయంలో 20 టీఎంసీలను నిల్వ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గండికోట నిర్వాసితులకు ఆర్‌ అండ్ ఆర్ ప్యాకేజీ అమలుచేస్తామని హమీఇచ్చారు.

ఇదీ చదవండి : భారత జట్టే ప్రపంచకప్​​ విజేత : షోయబ్​​ అక్తర్​

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు.
కంట్రిబ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_47_07_TDP_Meeting_AVB_AP10004

Body:అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే పథకాలను ప్రజల చెంతకు చేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం నాయకులు అన్నారు. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ అ తెదేపా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సాధారణ ఎన్నికలలో ఘోర ప్రభావం తర్వాత తొలిసారిగా జరుగుతున్న సమన్వయ కమిటీ సమావేశానికి పెద్ద సంఖ్యలో తెదేపా శ్రేణులు తరలి వచ్చాయి. ఈ సందర్భంగా పార్టీ కదిరి నియోజకవర్గ ఇంచార్జి కందికుంట వెంకటప్రసాద్, మాజీ శాసనసభ్యుడు చాంద్ భాష హాజరయ్యారు. ఐదేళ్ల తెదేపా పాలనలో ఈరోజు ప్రజలను వరుసలలో నిలపలేదన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో లో విఫలం అవుతున్న అధికార పార్టీ నాయకులు తమ తప్పును ప్రతిపక్షంపై నెట్టడం బాధాకరమని నాయకులు అన్నారు. ప్రజలు తెలుగుదేశం పార్టీకి ప్రశ్నించే స్థానాన్ని ఇచ్చారని ఆ బాధ్యతను నిలబెట్టుకునేందుకు ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో కృషి చేయాలని నాయకులు అన్నారు.

Conclusion:బైట్స్
చాంద్ బాష, మాజీ శాసనసభ్యుడు
కందికుంట వెంకట ప్రసాద్, ఇంచార్జి,తెదేపా, కదిరి
Last Updated : Jul 8, 2019, 3:31 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.