కడప జిల్లాలో 6 నెలలుగా ముఖ్యమంత్రి ఏం అభివృద్ధి పనులు చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. జిల్లాలో మూడోరోజు పర్యటనలో మాట్లాడిన ఆయన.. తమను అణగదొక్కాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. సీఎం ఏ మాత్రం అవగాహన లేకుండా పనిచేస్తున్నారని విమర్శించారు. ఒకసారి వర్షాలు పడితే నాలుగైదేళ్లు వానలు పడకపోయినా కరవు ఉండకూడదనే లక్ష్యంతో తాము పనిచేశామని చెప్పారు. నదుల అనుసంధానం వల్ల గోదావరి నీళ్లు కృష్ణాకు తీసుకొచ్చామని.. కాల్వలు తవ్విన తర్వాత నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో ప్రస్తుత ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.
అవగాహన రాహిత్యం
అవగాహన లేమి, వితండవాదంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. రైతు భరోసా నిధులు సకాలంలో ఇవ్వకుండా అన్నదాతలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలపై ఎక్కడికక్కడ దాడులు చేయడం అలవాటైందనీ.. ఇదే కొనసాగితే ప్రైవేటు కేసులు వేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు.
ఇవీ చదవండి: