ఎంతటి దుర్మార్గుడైనా కాలగర్భంలో కలిసిపోక తప్పదని... ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు హితవు పలికారు. కడపలో రెండోరోజు పర్యటిస్తున్న చంద్రబాబు... వైకాపా బాధితులతో మాట్లాడారు. ఎవరూ అధైర్యపడొద్దని... అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి... కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అక్రమ కేసులు నమోదైనవారి కోర్టుకు అయ్యే ఖర్చు పార్టీనే భరిస్తుందని హామీఇచ్చారు.
ఇదీ చదవండి