కడప జిల్లా జమ్మలమడుగలో బాంబులు కలకలం రేపాయి. స్థానిక ముద్దనూరు రోడ్డులోని ఓ ప్రైవేటు స్థలంలో.. రియల్ ఎస్టేట్ వ్యాపారి భూమిని చదును చేస్తుండగా మొత్తం 14 బాంబులు బయటపడ్డాయి. ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా ఈ నెల 8న ఇదే చోట హెలిపాడ్ ఏర్పాటు చేశారు. అటువంటి చోట బాంబులు బయటపడటం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఒకచోట 13, మరోచోట ఒకటి చొప్పున మెుత్తం 14 బాంబులు బయటపడ్డాయి. ముందు జాగ్రత్త చర్యగా.. ఆ పరిసర ప్రాంతాన్ని పూర్తిగా చదును చేసిన పోలీసులు.. మరో 40 బాంబులు బయటపడేసరికి విస్తుపోయారు. స్థానిక డీఎస్పీ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధ్యులు ఎవరైనా.. కఠిన చర్యలు తప్పవన్నారు.
ఇదీ చదవండి