కడప జిల్లా కమలాపురం మండలంలో... దినేష్ అనే యువకుడు సుమారు 100 మందితో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. పెద్ద చెప్పలి హైస్కూల్ ఆవరణలో సేవ్‌లైఫ్ టీం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కమలాపురం నియోజకవర్గ తెదేపా ఇంఛార్జి పుత్తా నరసింహారెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఇలాంటి మంచి పనిని ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. దినేష్‌ను అభినందించారు. పలు కారణాలతో పేదవారు రక్తం లేక మరణిస్తున్నారని... వారిని చూసి చలించి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశానని దినేష్ చెప్పాడు.
ఇదీ చదవండి :