ETV Bharat / state

పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా భాజపా భారీ ర్యాలీ

పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా... కడప నగరంలో భాజపా చేపట్టిన భారీ ర్యాలీకి విశేష స్పందన లభించింది. కడప మున్సిపల్ మైదానం నుంచి కృష్ణాసర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, కోటిరెడ్డికూడలి మీదుగా అంబేడ్కర్ విగ్రహం వరకు సాగింది.

bjp support rally to caa in kadapa
పౌరసత్వ సవరణ చట్టానికి మద్ధతుగా కడపలో భాజపా భారీ ర్యాలీ
author img

By

Published : Jan 4, 2020, 4:01 PM IST

పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా భాజపా భారీ ర్యాలీ

దేశ భద్రత కోసం పటిష్టమైన పౌరసత్వ సవరణ చట్టాలను ప్రధాని మోదీ తీసుకొస్తే... దాన్ని విపక్షాలు విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ విమర్శించారు. దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని మోదీ పరిరక్షిస్తుంటే... కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశంలో అశాంతి సృష్టించేందుకు కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ నుంచి దేశానికి శరణార్థులుగా వచ్చిన లక్షల మంది ముస్లింల రక్షణ కోసమే పౌరసత్వ చట్టం తెచ్చామని ఆయన గుర్తుచేశారు.

ఇతర దేశాల నుంచి ముస్లింల చొరబాట్లు ఈ చట్టం వల్ల తగ్గుతాయన్నారు. జమ్ముకశ్మీర్ కు పాకిస్థాన్ నుంచి విముక్తి కల్పించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీదేనన్నారు. ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రవేశ పెట్టామన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి విపక్షాలు అడ్డుపడుతున్నా... కోట్ల మంది ప్రజల మద్దతు ప్రభుత్వానికి ఉందన్నారు. భాజపా చేపట్టిన భారీ ర్యాలీలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి, సత్యకుమార్, పార్టీ నేతలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి-పాలనా కేంద్రం విశాఖే... బీసీజీ నివేదిక స్పష్టం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.