పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఇండోర్ స్టేడియంలో... జిల్లాస్థాయి విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. 137 రకాల పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాదరావు తెలిపారు. పోటీల నిర్వహణకు 16 స్వచ్ఛంద సంస్థలు... 23 దివ్యాంగ సంఘాలు సహకారం అందించినట్లు పేర్కొన్నారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపునున్నట్లు వెల్లడించారు. విజేతలకు డిసెంబర్ 3న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం వేడుకల సందర్భంగా బహుమతులు అందజేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: సైనికుల కోసం కదిలిన దివ్యాంగులు