ETV Bharat / state

దయచేసి.. అతడికి బెయిల్ మంజూరు చేయోద్దు - తూర్పు గోదావరి ప్రేమోన్మాది దాడి న్యూస్

ప్రేమించానన్నాడు... యువతిపై కత్తితో దాడి చేశాడు. 83 కుట్లతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఆసుపత్రిలో నరకయాతన అనుభవించింది. ఒకవేళ నిందితుడు బయటకు వస్తే.. బాధితురాలి ప్రాణానికే ప్రమాదం కదా.  చేసిన తప్పుకు నిందితుడు శిక్ష అనుభవించాలా..? లేదా..?.  ఇప్పుడు ఆ బాధితురాలి ఆవేదన అదే. ఇంతకీ ఏంటా కథ.

దయచేసి.. అతడికి బెయిల్ మంజూరు చేయోద్దు
దయచేసి.. అతడికి బెయిల్ మంజూరు చేయోద్దు
author img

By

Published : Dec 3, 2019, 7:07 PM IST

ప్రేమోన్మాది దాడికి ఓ యువతి తల్లడిల్లిపోయింది. ఆసుపత్రిలో నాలుగు గోడల మధ్య... నరకం చూసింది. నేరం చేసిన వాడిని వదిలేస్తారా..? అంటూ ప్రశ్నిస్తోంది. అసలు ఘటనలోకి వెళ్తే... అది అక్టోబర్ నెల... పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో ఎమ్మెస్సీ చదువుతున్న యువతిని మేడపాటి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ప్రేమిస్తున్నాని వెంటపడేవాడు. చదువుకొని మంచి ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో ఉన్న విద్యార్థిని... అలాంటివి తన జీవితంలో కుదరవని చెప్పింది. కక్ష పెంచుకున్న సుధాకర్ రెడ్డి యువతిపై కత్తితో దాడి చేశాడు. స్థానికులు అడ్డుపడటంతో ప్రాణాలతో బయటపడింది బాధితురాలు. అంతకుముందే నిందితుడు పురుగుల మందు తాగాడు. ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న తర్వాత సుధాకర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సుమారు నెల రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందింది బాధితురాలు. ఇప్పుడు తాను అనే మాట ఒకటే... నిందితుడికి శిక్ష పడాల్సిందేనని. బెయిల్ మంజూరు చేస్తే... తనకు ప్రాణాపాయమని భయాందోళన వ్యక్తం చేస్తోంది.

దయచేసి.. అతడికి బెయిల్ మంజూరు చేయోద్దు
ఆసుపత్రిని నుంచి డిశ్చార్జ్ అయిన బాధితురాలు విలేఖరుల సమావేశంలో మాట్లాడింది. 'ఎమ్మెస్సీ పూర్తిచేసి ఉద్యోగం చేయాలనుకున్నా. ఉన్మాది దాడితో తీవ్రంగా నష్టపోయా. కత్తి గాట్లు వల్ల 83 కుట్లు పడ్డాయి. ఇప్పటికి నడవలేని స్థితిలో ఉన్నాను. అయినా ఆత్మస్థైర్యంతో చదువును కొనసాగిస్తా. సుధాకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే నాకు ప్రాణహాని ఉంటుంది. బెయిల్ రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.' అంటూ కన్నీటి పర్యంతమైంది.

ఇదీ చదవండి: యువతిని నరికి.. ఆపై ప్రేమోన్మాది ఆత్మహత్యాయత్నం

Intro:పశ్చిమ గోదావరి జిల్లా కోడూరు మండలం కవిటం గ్రామంలో యువతపై ప్రేమ ఉన్మాది దాడి ఇ ఘటన కు సంబంధించిన పాత విజువల్స్ గమనించగలరు

Body:arun

Conclusion:8008574467
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.