పశిమగోదావరి జిల్లా భీమవరంలో అలేఖ్య అనే ఎం ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. విజయవాడకు చెందిన అలేఖ్య పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఎం ఫార్మసీ చదువుకుంటూ వేరేగా గది తీసుకుని స్నేహితులతో కలిసి ఉంటోంది. శని, ఆదివారం సెలవు కావటంతో స్నేహితులంతా ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరూ లేని సమయంలో అలేఖ్య ఉరి వేసుకుని చనిపోయింది. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ యువతి రాసిన సూసైడ్ నోట్ ఆమె గదిలో లభ్యమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, హత్య లేక ఆత్మహత్యేనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: