నిర్భయ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలంటూ పశ్చిమగోదావరి జంగారెడ్డిగూడెంలో ప్రగతి శీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. భగత్ సింగ్ కూడలి నుంచి బస్టాండ్ వరకు మహిళలు భారీ ప్రదర్శన నిర్వహించి.. బోసుబొమ్మ కూడలిలో ధర్నా చేశారు. సమాజంలో మహిళలకు భద్రత భావం తగ్గిపోతుందని... నిర్భయ చట్టాన్ని అమలు చెయ్యడం లేదన్నారు. చట్టాలు ఏర్పాటు చేయడం కాదని వాటిని అమలు చేసి మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి...దిశ'తో... మృగాళ్లకు 21 రోజుల్లోనే శిక్ష అమలు