ఈ సీజన్లో గోదావరికి భారీగా వరద వచ్చినా పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్‌లు మాత్రం చెక్కు చెదరలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కాపర్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టారు. గోదావరి నదికి అడ్డంగా వీటిని నిర్మిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి అనువుగా వీటిని నిర్మిస్తున్నారు. రాక్ ఫిల్ డ్యామ్‌కు ఎగువ దిగువున కాపర్ డ్యామ్‌ల నిర్మాణం పూర్తి చేసి.. గ్రావిటితో నీటిని అందించాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది.
గోదావరి వరదను స్పిల్వే వైపు మళ్లించడంతో... రాక్ ఫిల్ డ్యామ్ పూర్తి చేయవచ్చని భావించారు. దీంతో కాపర్ డ్యామ్ పనులు శరవేగంగా చేశారు. మట్టి, రాళ్లతో నిర్మించిన కాఫర్ డ్యామ్‌లు అఖండ గోదావరిలో నిలుస్తాయా అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. అసంపూర్తిగా ఉన్న ఈ నిర్మాణాలు కొట్టుకుపోతాయని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. అయితే లక్షల క్యూసెక్కుల గోదావరి వరదను తట్టుకొని కాపర్ డ్యామ్‌లు నిలబడ్డాయి.
ఇదీ చదవండి