కోళ్ల, ఎద్దుల, పొట్టేళ్ల పందాలే కాదు.. పందులకూ పందేలు నిర్వహిస్తున్నారు వీళ్లు. ఎవరికి నచ్చినా.. నచ్చకున్నా.. ఈ ప్రక్రియ తమ సంప్రదాయంలో భాగమేనని అంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వాసులు. పోటీకి కాదేదీ అనర్హం అని నిరూపించారు. అందరినీ ఆకర్షించారు. కోడి పందేల్లో మాత్రమే డబ్బులు పెడతారని అనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే. అంతకు మించి ఈ పిగ్ ఫైట్ లో డబ్బులు చేతులు మారాయి. లక్షల రూపాయల మేర పందేలు కట్టారు. ప్రాణానికి హాని కాకుండా జీవులు నాశనం కాకుండా సాంప్రదాయ పద్ధతిలో ఈ పోటీలు జరుపుతుంటామని నిర్వాహకులు తెలిపారు. తాడేపల్లిగూడెంలో జరిగిన ఈ పోటీల్లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాటవరం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కోరుమామిడి పందులు విజేతలుగా నిలిచాయి.
ఇవీ చదవండి: