పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సకాలంలో అందటం లేదు. గతంలో మధ్యాహ్న భోజనాన్ని పాఠశాలలోని నిర్వాహకులతో వండించి విద్యార్థులకు అందించేవారు. అయితే ఈ పథక బాధ్యతలను ఈ ఏడాది జనవరి 1 నుంచి ఏక్తా శక్తి ఫౌండేషన్‌కు అందించారు. ఈ సంస్థ ద్వారా విద్యార్థులకు సకాలంలో భోజనం సరఫరా కాకపోవడం వల్ల విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ఉండి గ్రామం కేంద్రంగా ఏక్తా శక్తి ఫౌండేషన్ 96 పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని ప్రతి రోజూ వ్యాన్ ద్వారా సరఫరా చేస్తోంది. భోజనం నాణ్యత కూడా అంతంత మాత్రంగానే ఉండటం వల్ల విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి కొద్దికొద్దిగా దూరమవుతున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి సకాలంలో నాణ్యమైన ఆహారాన్ని అందించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: